![]() |
![]() |
.webp)
ఫామిలీ షో లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. ఇక ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే అత్తా కోడళ్ల ఫైట్ పెట్టారు. మధ్యలో కో- హోస్ట్ గా ఉన్న టేస్టీ తేజ ని తెచ్చి ఒంగోబెట్టి ఒక్కో అత్తా గట్టిగానే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. తేజ వీపును ఎవరైతే ఎక్కువ ఫ్రీక్యూన్సీలో మోత మోగిస్తారో అన్నదే ఇక్కడి టాస్క్.ముందు నతకుమారి వచ్చి ఒక రేంజ్ లో నడుము విరిగిపోయేలా కొట్టింది. ఇక లేడీ కమెడియన్ సునయన వచ్చి నేను అత్తలందరినీ తలుచుకుని కొడతాను అని చెప్పి గట్టిగా వీపు మీద బాధేసింది.
ఎగిరెగిరి కొడతా అంది. వెంటనే తేజ అమ్మ నేను గిన్నెనో పరుపునో కాదమ్మా ఎగరమాకు అనేసరికి రెండు చేతులు జోడించి కొట్టింది. అంతే నేల మీద దొర్లాడు తేజా. ఇక అత్తా కోడళ్ల మధ్య కబడ్డీ ఆట పెట్టారు.
దాంతో సౌందర్య రెడ్డి వెళ్లి "తడి చెత్త పొడి చెత్తా ఇపోయావే నా అత్తా" అంటూ కూత పెట్టింది. తర్వాత అత్తల వైపు నుంచి నటకుమారి వచ్చి "మాది విశాఖపట్నం..ఇస్తా రా కట్నం" అంటూ కూత పెట్టేసరికి కోడళ్ళు గట్టిగా ఆమె జుట్టును పట్టుకున్నారు. అంతే ఆమె కంగారు పడిపోయింది. "ఓడిపోయాను. కాళ్ళు పట్టుకున్నా పర్లేదు, జుట్టు పట్టుకున్నా పర్లేదు. జుట్టు మాత్రం పట్టుకోకూడదు మేడం విగ్ మేడం ఊడిపోతుంది" అంది. దాంతో అందరూ నవ్వేశారు.
![]() |
![]() |